https://oktelugu.com/

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్ ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఉగాది పండుగకు 20,000 ఉద్యోగ ఖాళీలతో కూడిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఉగాది పండుగకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు. ప్రభుత్వం ఈ ఏడాది మే నెల 31వ తేదీన ఈ జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయనుందని సమాచారం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూర్చేందుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 16, 2021 / 08:19 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఉగాది పండుగకు 20,000 ఉద్యోగ ఖాళీలతో కూడిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఉగాది పండుగకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు. ప్రభుత్వం ఈ ఏడాది మే నెల 31వ తేదీన ఈ జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయనుందని సమాచారం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూర్చేందుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది.

    ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ ఇప్పటికే శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలలో ఉద్యోగ ఖాళీల వివరాలను తేల్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను డైరెక్టరీ ఆఫ్‌ పోస్ట్స్‌ అండ్‌ పర్సనల్‌ విభాగంలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    గ్రూప్‌ 1, 2, 3, 4 కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీఅ లెక్కను కూడా తేల్చాలని సూచనలు చేశారు. ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల్లో ప్రాధాన్యత ఆధారంగా సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు ఏ ఏ పోస్టులు ఎన్ని భర్తీ చేయాలో సూచించాలని పేర్కొన్నారు. బ్యాక్‌లాగ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల ఖాళీలను కూడా భర్తీ చేయాలని ఆయన వెల్లడించారు.

    రాష్ట్ర విభజన తరువాత కొన్ని శాఖలు, విభాగాల్లో క్షేత్ర స్థాయిలో సిబ్బందికి పని తక్కువైన విషయాన్ని కూడా గుర్తించుకోవాలని సీఎస్ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తైతే పదోన్నతులకు సంబంధించిన వివరాలు కూడా సులభంగా తెలిసే అవకాశాలు ఉంటాయి.