
దేశంలో నిరుద్యోగులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు కల్పించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ విధానంలో 25 ఉద్యోగాల భర్తీ జరగనుంది. కేఆర్‌సీఎల్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
మొత్తం 25 ఉద్యోగాలలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) 7 ఉండగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు 13, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు 5 ఉన్నాయి. http://konkanrailway.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు వెబ్ సైట్ లోని వివరాల ఆధారంగా ఈ మెయిల్ ద్వారా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. usbrl.vacancy@krcl.co.in ఈ మెయిల్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 27వ తేదీ చివరి తేదీగా ఉంది. రాతపరీక్ష లేకపోవడంతో ఎవరైతే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారో వారు మాత్రమే ఉద్యోగాలకు ఎంపికవుతారు. పదోతరగతి, ఐటీఐ, బీఈ/ బీటెక్ లలో ఉద్యోగాన్ని బట్టి అర్హతతో పాటు అనుభవం కూడా ఉండాలి. ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.
రైల్వే శాఖలో ఉద్యోగాలు కావడంతో పోటీ తీవ్రస్థాయిలో ఉంటుంది. సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంటే మాత్రమే ఉద్యోగాలకు సులువుగా ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. గత కొన్ని రోజులుగా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నోటిఫికేషన్లు వెలువడుతూ ఉండటం గమనార్హం.