https://oktelugu.com/

July 1 Changes: జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివేనా?

July 1 Changes: కేంద్రం జులై 1 నుంచి సమూల మార్పులు తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను తీసుకొస్తోంది. దీంతో కొన్ని లాభాలున్నా నష్టాలు ఉండటం గమనార్హం. కొత్తగా తీసుకొచ్చే చట్టాలతో పనిభారం పెరిగే సూచనలు ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతనంగా ప్రవేశపెట్టే చట్టాలతో ఉద్యోగులు కొంత ఇబ్బందులు పడినా లాబాలు కూడా ఉండటం మంచిదే. దీంతో కేంద్రం తీసుకొచ్చే కొత్త కార్మిక చట్టాలతో ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ఈ క్రమంలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 28, 2022 / 09:16 AM IST
    Follow us on

    July 1 Changes: కేంద్రం జులై 1 నుంచి సమూల మార్పులు తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను తీసుకొస్తోంది. దీంతో కొన్ని లాభాలున్నా నష్టాలు ఉండటం గమనార్హం. కొత్తగా తీసుకొచ్చే చట్టాలతో పనిభారం పెరిగే సూచనలు ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతనంగా ప్రవేశపెట్టే చట్టాలతో ఉద్యోగులు కొంత ఇబ్బందులు పడినా లాబాలు కూడా ఉండటం మంచిదే. దీంతో కేంద్రం తీసుకొచ్చే కొత్త కార్మిక చట్టాలతో ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ఈ క్రమంలో నూతన చట్టాల తీరుతో ఉద్యోగుల్లో కాస్త ఆందోళన కూడా పెరుగుతోంది.

    July 1 Changes

    29 చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజిస్తున్నారు. దీంతో ఉద్యోగుల పీఎఫ్, గ్రాడ్యూటీ పెంచేందుకు నిర్ణయం తీసుకుంటోంది. 50 శాతం బేసిక్ పే చేసి మిగతాది పీఎఫ్ గా తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన చట్టంతో ఉద్యోగుల ఆదాయం పెరిగినా సంపాదన మాత్రం తగ్గనుంది. ఎందుకంటే 50 శాతం పీఎఫ్, గ్రాడ్యూటీ కింద వెళితే ఉద్యోగికి వచ్చేది తక్కువే. కానీ భవిష్యత్ లో దాని అవసరం ఉన్నా ప్రస్తుతం మాత్రం ఖర్చులు మాత్రం తీరడం కష్టమే.

    Also Read: Election Commission of India: రాజకీయ పార్టీలపై ఈసీ కొరడా

    ఇక పని భారం కూడా పెరిగే అవకాశాలున్నాయి. రోజుకు 12 గంటల పని కూడా చేయాల్సి రావడం భారమే. ప్రస్తుతం ఎనిమిది గంటల పనికే తట్టుకోలేకపోతున్న వారు పన్నెండు గంటలు పని అంటే నిట్టూర్చడం ఖాయం. దీంతో పనిభారం పెరిగే సూచనలు స్పష్టంా కనిపిస్తున్నాయి. దీనికి తట్టుకుంటారో లేదో చూడాల్సిందే. ఇక వారానికి సెలవులు మాత్రం మూడు ఉండనున్నాయి. పని గంటలు అయితే 48 గంటలు అంటే నాలుగు రోజులు పని మూడు రోజులు సెలవులు రానున్నాయి.

    July 1 Changes

    దీనిపై కార్మిక వర్గాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని లాబాలున్నా నష్టాలు కూడా ఉన్నాయి. దీంతో కార్మికులు పనిచేసే చోట పనిభారం ఎక్కువ కానుంది. ఏకధాటిగా నాలుగు రోజులు పనిచేయాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకే కేంద్రం తీసుకున్న నిర్ణయం సమంజసంగా లేదనే వాదనలు వస్తున్నాయి. మొత్తానికి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో ఏ మేరకు ప్రభావం చూపుతుందో, ఎంత మేర ప్రతికూల ప్రభావాలు వస్తాయో తెలియడం లేదు. కానీ కేంద్రం తెచ్చిన చట్టంపై అందరిలో విస్మయం వ్యక్తమవుతోంది.

    Also Read:Abortion Law in US: గర్భస్రావ చట్టంలో మార్పులు అమెరికాకు ఇప్పుడు భారత్ ఆశాదీపం

    Tags