https://oktelugu.com/

Jobs: ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో జాబ్స్.. ఎవరు అర్హులంటే?

Jobs: ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 4 ఉద్యోగ ఖాళీలను ఈ సంస్థ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. హిందీ ట్రాన్స్ లేటర్, అసిస్టెంట్ పోస్టులు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానుండగా ఫైనాన్స్, అడ్మిన్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎవరైతే ఈ ఉద్యోగ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 8, 2022 / 08:29 AM IST
    Follow us on

    Jobs: ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 4 ఉద్యోగ ఖాళీలను ఈ సంస్థ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. హిందీ ట్రాన్స్ లేటర్, అసిస్టెంట్ పోస్టులు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానుండగా ఫైనాన్స్, అడ్మిన్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

    ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు బ్యాచిలర్ డిగ్రీతో పాటు మాస్టర్స్ డిగ్రీ తప్పనిసరిగా పాసై ఉండాలి. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కు ఎంపికయ్యే వాళ్లకు అనుభవం కచ్చితంగా ఉండాలి. ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సంస్థ కేవలం ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ను కల్పిస్తోంది.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 21,000 రూపాయల నుంచి 74,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. రాతపరీక్ష ఆధారంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లో జాబ్స్ ను భర్తీ చేస్తారు. 2022 సంవత్సరం జనవరి 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://irfc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. సంస్థ ఢిల్లీ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఎక్కువ వేతనంతో భర్తీ చేస్తున్న ఉద్యోగ ఖాళీలు కావడంతో వీటికి పోటీ ఎక్కువగానే ఉంటుంది.