https://oktelugu.com/

Jobs: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో జాబ్స్.. భారీ వేతనంతో?

Jobs: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తాజాగా తీపికబురు అందించింది. వరుస ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటంతో నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. మొత్తం 9 ఉద్యోగ ఖాళీలకు గెయిల్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా ఈ ఉద్యోగ ఖాళీలలో చీఫ్ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్) ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్) ఉద్యోగ ఖాళీలు 7 ఉన్నాయి. https://gailonline.com వెబ్ సైట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 14, 2022 / 08:22 AM IST
    Follow us on

    Jobs: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తాజాగా తీపికబురు అందించింది. వరుస ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటంతో నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. మొత్తం 9 ఉద్యోగ ఖాళీలకు గెయిల్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా ఈ ఉద్యోగ ఖాళీలలో చీఫ్ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్) ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్) ఉద్యోగ ఖాళీలు 7 ఉన్నాయి.

    https://gailonline.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మన దేశ పౌరులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. చీఫ్ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్) ఉద్యోగ ఖాళీలకు ఎంబీబీఎస్ చదివిన వాళ్లు అర్హులని చెప్పవచ్చు. జనరల్ మెడిసిన్ లో ఎండీ లేదా డీఎన్బీతో ఎంబీబీఎస్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు గ్రేడ్ e-5 అయితే 90,000 రూపాయల నుంచి 2,40,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్) ఉద్యోగ ఖాళీలకు గ్రేడ్ e-2 వాళ్లకు 60,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశాలు ఉంటాయి. చీఫ్ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్) ఉద్యోగ ఖాళీలకు 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు.

    సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్) ఉద్యోగ ఖాళీలకు 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు. 2022 సంవత్సరం జనవరి 20 నాటికి ఈ వయస్సులోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఈ ఏడాది జనవరి నెల 20వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.