డిగ్రీ అర్హతతో అమెజాన్ లో జాబ్స్.. ఏడాదికి రూ.4 లక్షల వేతనంతో?

ప్రముఖ ఈకామర్స్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పాలి. https://www.amazon.jobs/en వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన […]

Written By: Navya, Updated On : October 25, 2021 10:01 am
Follow us on

ప్రముఖ ఈకామర్స్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పాలి. https://www.amazon.jobs/en వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరైతే అర్హత కలిగి ఉండి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు సంవత్సరానికి 2,75,000 రూపాయల నుంచి 4,00,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుంది.

https://amazonvirtualhiring.hirepro.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లో బాగా మాట్లాడే సామర్థ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ను కలిగి ఉన్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు షిఫ్ట్ లకు అనుకూలంగా పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం చేయడానికి అవసరమైన ఇంటర్నెట్ ను ఉద్యోగి కలిగి ఉండాలి.

వారంలో 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది. వారంలో రెండు రోజులు సెలవుదినాలుగా ఉంటాయి. కమ్యునికేషన్ స్కిల్స్ తో పాటు భాషా నైపుణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన ఉద్యోగి హైదరాబాద్ లో ఉండే సంస్థకు అందుబాటులో ఉండాలి.