Army Public School Secunderabad Recruitment: సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Army Public School Secunderabad Recruitment: సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 52 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌, ట్రైన్డ్‌ […]

Written By: Navya, Updated On : December 30, 2021 11:41 am
Follow us on

Army Public School Secunderabad Recruitment: సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 52 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ టీజీటీ, ప్రైరీ టీచర్‌ (పీఆర్‌టీ), ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్సక్ట్రర్‌ (పీటీఐ), పీఆర్‌టీ (మ్యూజిక్‌ వెస్ట్రన్‌, డ్యాన్స్‌) ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

Army Public School Secunderabad Recruitment

సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పాసైన వాళ్లు పోస్ట్‌ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కెమెస్ట్రీ, బయోలజీ, ఫిసికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, కామర్స్, జియోగ్రఫీలో కూడా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్, బీఈడీ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ/డీ.ఈడీ చేసిన వాళ్లు పీఆర్టీ పోస్టులకు దరఖస్తు చేసుకోవడానికి అర్హులు.

Also Read: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో భారీవేతనంతో జాబ్స్.. పరీక్ష లేకుండా?

ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ట్రక్టర్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాసు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఆఫ్‌లైన్‌ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

https://apsrkpuram.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.

Also Read:  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో జాబ్స్.. రాతపరీక్ష లేకుండా?