PNB Recruitment: పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

PNB Recruitment: న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌(సీఆర్‌ఓ), చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ), చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(సీటీఓ), చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌(సీఐఎస్‌ఓ) ఉద్యోగాలకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు […]

Written By: Kusuma Aggunna, Updated On : December 24, 2021 2:43 pm
Follow us on

PNB Recruitment: న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌(సీఆర్‌ఓ), చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ), చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(సీటీఓ), చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌(సీఐఎస్‌ఓ) ఉద్యోగాలకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం.

PNB Recruitment

45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. బీఈ/బీటెక్, ఇంజనీరింగ్‌/ఎంసీఏ, మాస్టర్స్‌/ఇంజనీరింగ్‌ డిగ్రీ, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ పాసై సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

జనరల్‌ మేనేజర్‌–హెచ్‌ఆర్‌ఎండీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, హ్యూమన్‌ రిసోర్స్‌ డివిజన్, ఫస్ట్‌ ఫ్లోర్, వెస్ట్‌ వింగ్, కార్పొరేట్‌ ఆఫీస్‌ సెక్టార్‌–10, ద్వారకా, న్యూఢిల్లీ–110075 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, స్క్రీనింగ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం.

2022 సంవత్సరం జనవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.pnbindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: టీఎంసీలో 175 ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.53,100 వేతనంతో?