Jobs: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.
ట్రాఫిక్ అండ్ టోల్ రెవెన్యూ, ఫైనాన్స్, ఎఫ్ అండ్ ఏ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించి కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఏ/ ఐసీడబ్ల్యూఏ పాసై 10 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.
సంబంధిత స్పెషలైజేషన్ లో గ్రాడ్యుయేషన్ తో పాటు 5 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు hr.nhiimpl@nhai.org వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను పంపే అవకాశం ఉంటుంది. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటం గమనార్హం.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Job vacancies in national highway authority of india with good salary
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com