Homeఎంటర్టైన్మెంట్Puri Jagannadh: పూరి నుంచి మరో క్రేజీ పాఠం.. ప్రతి మనిషికీ అది...

Puri Jagannadh: పూరి నుంచి మరో క్రేజీ పాఠం.. ప్రతి మనిషికీ అది ఉండాలి !

Puri Jagannadh: ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా అద్భుతమే, కొత్త జనరేషన్ కు ఆ మాటలే గొప్ప పాఠాలు. అందుకే ‘పూరీ మ్యూజింగ్స్’కి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలను ముఖ్యంగా ప్ర‌పంచంలోని వింత‌లను, విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెప్పుకొస్తోన్న ఈ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాడు. టాపిక్ పేరు ‘ఇకిగాయ్‌’.

Puri Jagannadh
Puri Jagannadh

దీని గురించి పూరి మాటల్లోనే.. ‘ఆనందం కోసం జపనీయుల దగ్గర ‘ఇకిగాయ్‌’ అనే ఓ కొత్త టాపిక్ ఉంది. ఎక్కువగా డబ్బు సంపాదించటం, మన కోరకల్ని తీర్చుకోవటం, అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవటం… వీటిల్లో మనం ఏం చేస్తే జీవితంలో ఆనందంగా ఉంటాం? అనే విషయాన్ని ముందు మనిషి తెలుసుకోవడం బెటర్, ప్రతి మనిషికీ ఒక ఇకిగాయ్‌ ఉండాలి. పూర్వం మనుషులంతా వేటగాళ్లలా బతికారు. తర్వాత మన జాబ్స్‌ లో చాలా మార్పులు వచ్చాయి. కొత్తకొత్త పనులు వచ్చాయి. అలాగే జాబ్స్ వచ్చాయి.

Also Read:   నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

కొందరికి పెయింటింగ్‌ అంటే ఇష్టం, మరికొందరికి డ్యాన్స్‌ అంటే ఇష్టం. అలాంటి ఇష్టమైన పనులు చేస్తుంటే అనవసరమైన ఆలోచనలు మనిషికి రావు. పైగా ఎంతో ఆనందంతో ఉంటారు. కానీ, డబ్బు ఎవరిస్తారు? అందుకే ఏదో ఒక జాబ్ చేస్తుంటాం. కంఫర్దబుల్‌ జీవితం కావాలంటే మనందరికీ డబ్బు కావాలి కదా. అయితే, అది ఎంత మొత్తమో తెలుసుకోవాలి. నాలుగు విషయాల్లో మీరు ఎందులో ఉన్నారో చెక్‌ చేసుకోవాలి.

1. నీకు నచ్చింది చేయటం. 2. ప్రపంచానికి నచ్చింది చేయటం. 3. ఎక్కువ డబ్బు వచ్చేది చేయటం. 4. నువ్వు ఎందులో స్పెషలిస్ట్రవో ఆ రంగంలో పనిచేయటం. మీరు 1, 4 మధ్య ఉంటే అది ప్యాషన్‌. ఒకవేళ మీరు 1& 2 మధ్య ఉంటే అది మిషన్‌. మీ పనిని ఇంకా బాగా ఎలా చేయాలో ఆలోచించండి. 3& 4 మధ్య ఉంటే అది ప్రొఫెషన్‌. ఇందులో మీకు ఇష్టమైనవి, కొత్తకొత్త విషయాలు తెలుసుకోవాలి. 2& 4 మధ్య ఉంటే ఒకేషన్‌. చేస్తున్నదాన్ని సవాలుగా తీసుకుని ఇంకా బెటర్‌ అయ్యేలా చూడాలి. ముఖ్యంగా మనకేం కావాలో తెలియాలి. మనం ఏం
చేస్తున్నామో తెలియాలి. అదే ఇకిగాయ్‌. ఇంతకీ ఇకిగాయ్‌ అంటే రీజన్‌ ఫర్‌ యువర్‌ బీయింగ్‌’ అని పూరీ చెప్పుకుకొచ్చాడు.

Also Read: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో జాబ్స్.. భారీ వేతనంతో?నీళ్లలో ఉప్పు వేసుకుని తాగితే ఇన్ని లాభాలా.. ఆ ఆరోగ్య సమస్యలకు చెక్!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

3 COMMENTS

  1. […] Punjab CM: పంజాబ్ లో పాగా వేయాలని అమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఇందుకు గాను ప్రణాళికలు రచిస్తోంది. కొత్తదనానికి ఎప్పుడు ప్రాధాన్యం ఇచ్చే అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ఆసక్తికర చర్చకు తెర లేపారు. సీఎం అభ్యర్థిని ఓటర్లే నిర్ణయించుకుంటారని కొత్త పల్లవి అందుకున్నారు దీంతో రాజకీయాల్లోనే సంచలనం అవుతోంది. ఇన్నాళ్లు సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన ప్రజలను కొత్త మార్గంలో నడిపించేందుకు కేజ్రీవాల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు గాను కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. […]

  2. […] Omicron: భారత్‌తో పాటు ప్రపంచమంతా ప్రస్తుతం మళ్లీ కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో జనాలు భయపడిపోతున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ దాని ప్రభావం ఉండటం లేదు. ఈ క్రమంలోనే అన్ని దేశాల ప్రభుత్వాలు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కాగా, ఈ బూస్టర్ డోస్ ఒమిక్రాన్ వేరియంట్ పైన ప్రభావం చూపుతున్నదా? నిపుణులు ఏమంటున్నారు? అనే సంగతులు తెలుసుకుందాం. […]

  3. […] Corona Treatment: కరోనా కల్లోలం అంతా ఇంతా కాదు. మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోయాయి. మొదటి, రెండో దశల్లో మనుషుల ప్రాణాలు గాల్లో కలిసి పోయిన సంగతి తెలిసిందే. కొన్ని సార్లు అదృష్టం తలుపు తడితే మరోమారు దురదృష్టం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని ధర్మజయ్ అనే రైతుకు గత మే నెల 2న కరోనా సోకింది. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా అతడికి ఖరీదైన వైద్యం అవసరమైంది. దీని కోసం డబ్బులు కూడా ఎక్కువగానే ఖర్చయ్యాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular