MINT Recruitment: భారత ప్రభుత్వ మింట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పని చేసే ఈ సంస్థ 15 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. సూపర్ వైజర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఎంగ్రేవర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
బీఈ, బీటెక్ పాసైన వాళ్లు సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. బీఎస్సీ పాసైన వాళ్లు ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.
Also Read: ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. భారీ వేతనంతో?
బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (స్ల్కప్చర్, పెయింటింగ్) పూర్తి చేసిన వాళ్లు ఎంగ్రేవర్ పోస్టులకు అర్హులు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. డిసెంబర్ 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 21,450 రూపాయల నుంచి 95,910 రూపాయలు వేతనంగా లభించనుంది. https://igmhyderabad.spmcil.com/interface/jobopenings.aspx?menue=5 వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
Also Read: ఐఐటీ తిరుపతిలో టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. లక్షకు పైగా వేతనంతో?