Defence Jobs: డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Defence Jobs: ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆర్గనైజేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. భారత రక్షణ శాఖకు సంబంధించిన ఈ సంస్థలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం 97 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తం 97 ఉద్యోగ ఖాళీలలో గ్రేడ్-2 సబ్‌ డివిజనల్‌ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 8, 2021 11:56 am
Follow us on

Defence Jobs: ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆర్గనైజేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. భారత రక్షణ శాఖకు సంబంధించిన ఈ సంస్థలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం 97 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

Defence Jobs

మొత్తం 97 ఉద్యోగ ఖాళీలలో గ్రేడ్-2 సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలు 89 ఉండగా జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఉద్యోగ ఖాళీలు 7, హిందీ టైపిస్ట్ జాబ్ 1 ఉంది. పదో తరగతితోపాటు, సర్వేయింగ్‌లో డిప్లొమా సర్టిఫికెట్‌ ను కలిగి ఉన్నవాళ్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి పాసై నిమిషానికి 25 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు హిందీ టైపిస్ట్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: డిగ్రీ పాసైన విద్యార్థులకు శుభవార్త.. భారీ వేతనంతో జాబ్స్?

18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అభ్యర్థులు ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌, డిఫెన్స్‌ ఎస్టేట్స్‌, సధరన్‌ కామండ్‌, కోడ్వా రోడ్‌, పుణె – 411040 అడ్రస్ కు దరఖాస్తులను పంపాలి.

రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.dgde.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.

Also Read: బీటెక్ అభ్యర్థులకు టీసీఎస్ లో ఉద్యోగ ఖాళీలు.. అర్హులు ఎవరంటే?