కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ప్రొఫెషనల్ సర్వీస్ రిప్రజంటేటివ్, ఏరియా మేనేజర్లు, రీజియనల్ సేల్స్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఫార్మసీ/ సైన్స్/ కామర్స్/ ఆర్ట్స్‌లో కనీసం గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఏరియా మేనేజర్ పోస్టులకు సైన్స్ లేదా గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత పొంది ఫ్రంట్ లైన్ మేనేజర్ గా కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కావడం గమనార్హం.
రీజియనల్ సేల్స్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు ఫార్మసీ/సైన్స్/ కామర్స్ అభ్యర్థులు అర్హులు కాగా 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేఏపీఎల్, ఎన్‌టీటీఎఫ్ మెయిన్ రోడ్, పీన్యా ఇండస్ట్రియల్ ఏరియా, బెంగళూరు అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
ప్రొఫెషనల్ సర్వీస్ రిప్రజంటేటివ్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 26,000 రూపాయలు, ఏరియా మేనేజర్ పోస్టులకు ఎంపికైన వాళ్లకు నెలకు 40,000 రూపాయలు, రీజినల్ సేల్స్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన వాళ్లకు నెలకు 65,000 రూపాయలు వేతనంగా లభించనుంది. https://www.kaplindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.