https://oktelugu.com/

ఏపీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శిక్షణ.. జాబ్స్ గ్యారంటీ..?

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ ఏపీలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు కీలక ప్రకటన చేశారు. సీఎక్స్‌వో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతూ సతీష్ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికై మైక్రోసాఫ్ట్ తో నైపుణ్య శిక్షణకు సంబంధించి చర్చలు జరిపామని ఆయన పేర్కోన్నారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 3, 2021 / 06:46 PM IST
    Follow us on

    ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ ఏపీలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు కీలక ప్రకటన చేశారు. సీఎక్స్‌వో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతూ సతీష్ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు.

    ఇప్పటికై మైక్రోసాఫ్ట్ తో నైపుణ్య శిక్షణకు సంబంధించి చర్చలు జరిపామని ఆయన పేర్కోన్నారు. 1,60,000 డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సతీష్ చంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో డిగ్రీ సిలబస్ ను నాలుగేళ్లకు మార్చడంతో పాటు 10 నెలల ఇంటర్న్‌షిప్ ను తప్పనిసరి చేసింది.

    రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జి. జయలక్ష్మి మాట్లాడుతూ వ్యవసాయం, విద్య, వైద్య, స్మార్ట్‌ సిటీ లాంటి ఆరు రంగాలతో ఐటీని అనుసంధానం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను మరింత పెంచుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెరుగుతుండటంతో ఈ దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుందని ఆమె తెలిపారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐటీ వినియోగాన్ని పెంచినట్టు తెలిపారు.

    రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన కియోస్క్‌లే ఐటీ వినియోగం పెంచామని చెప్పడానికి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఈ–క్రాపింగ్, మార్కెటింగ్‌ లో ఖర్చులను తగ్గిస్తున్నామని అన్నారు. డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా వ్యయం తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయని ఆయన వెల్లడించారు.