NEET Leaked : నీట్ ప్రశ్న పత్రం నిజంగానే లీక్ అయిందా? కేంద్రం ఏం చేయబోతోంది?

NEET Leaked : ఈ పరీక్షను రద్దు చేయాలా? ఫలితాలను యధావిధిగా కొనసాగించాలా? ఈ విషయంపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Written By: NARESH, Updated On : June 16, 2024 9:47 pm

NEET Question Paper

Follow us on

NEET Leaked : నీట్ పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రం లీక్ అయ్యిందని వస్తున్న వార్తల్లో నిజం ఉందని తేలుతోంది. ఈ ప్రశ్న పత్రానికి సంబంధించి ఒక్కో అభ్యర్థి వద్ద 30 నుంచి 32 లక్షల దాకా నిందితులు వసూలు చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అందులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పి.. వల్లె వేయించారు. ఇందుకోసం విద్యార్థులను రహస్య ప్రదేశాలకు తీసుకెళ్లారు. పేపర్ లీక్ అయిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకుండా ఉండేందుకు.. ఆ విద్యార్థులను పరీక్ష చివరి రోజు దాకా రహస్య ప్రదేశాల్లోనే ఉంచారు. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా వారిని పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లారు.. బీహార్ రాష్ట్రంలో నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి జరుగుతున్న ఎంక్వైరీలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో 14 మందిని అరెస్టు చేశారు. వారంతా కూడా బీహార్ పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల నియంత్రణ విభాగానికి అసలు విషయం చెప్పారు.

నిందితులు చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు 13 మంది అభ్యర్థులను గుర్తించారు. వారిలో నలుగురిని అరెస్ట్ చేశారు. ఇక మరో 9 మంది అభ్యర్థులకు నోటీసులు పంపించారు. నీట్ పేపర్ ను సాల్వార్ అనే గ్యాంగ్ లీక్ చేసిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారందరి సోమవారం పాట్నాలోని పోలీసు శాఖ కార్యాలయంలో విచారించనున్నారు. ఇక నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు.. చెప్పిన వివరాలను జాతీయ మీడియా సంస్థలు బయటపెట్టాయి. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సికిందర్ కుమార్ యాదవేందు అనే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడు..” పాట్నాలో నితీష్, అమిత్ ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తులు ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నడుపుతున్నారు. మే 5న నీట్ పరీక్ష జరిగింది. అంతకుముందు ఒక రోజే వారికి పేపర్ చేతికి వచ్చింది. వారు వెంటనే ఆ పేపర్ కోసం డబ్బు చెల్లించిన అభ్యర్థులను రహస్యంగా రామకృష్ణ నగర్ అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ రహస్య గదుల్లో ఉంచారు. వారిని బయటికి వెళ్లకుండా చేశారు.. కనీసం వారికి ఫోన్లు కూడా ఇవ్వలేదని” సికిందర్ పోలీసుల ఎదుట పేర్కొన్నాడు. అతడు చెప్పిన వివరాలను నితీష్, అమిత్ కూడా ధ్రువీకరించారు. ప్రశ్నపత్రం లీకేజీలో తమ పాత్ర ఉందని వాడు ఒప్పుకున్నారు. రాష్ట్ర పత్రాలు ఇచ్చేందుకు ఒక్కొక్క అభ్యర్థి నుంచి 30 నుంచి 32 లక్షల దాకా వసూలు చేశామని వెల్లడించారు.

అయితే సోమ, మంగళవారాల్లో నిందితులను విచారించిన తర్వాత, పూర్తి విషయాలు వెల్లడిస్తామని పాట్నా పోలీసులు చెబుతున్నారు. మరో వైపు ఈ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో భారీగా డబ్బులు చేతులు మారడంతో.. ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యం ఆధారపడి ఉన్న నేపథ్యంలో.. ఈ పరీక్షను రద్దు చేయాలా? ఫలితాలను యధావిధిగా కొనసాగించాలా? ఈ విషయంపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.