Jobs: ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు విభాగాలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం అందుతోంది. మొత్తం 23 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. సిగ్నలింగ్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని బోగట్టా.
బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: RRR Movie Child Artist Malli: ఆర్ఆర్ఆర్ చిత్రంలో చిన్నారి మల్లి పాత్ర చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. న్యూఢిల్లీలోని ఇర్కాన్ కార్యాలయానికి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 30,000 నుంచి రూ. 2,20,000 వరకు వేతనం లభిస్తుంది.
2022 సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. https://www.ircon.org/index.php?lang=en వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Also Read: Sai Dharam Tej: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి షూటింగ్ కు వచ్చిన సాయిధరమ్ తేజ్ కు ఇది షాకింగ్