Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.40,000 వేతనం లభిస్తుంది.
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఇండియన్ ఆయిల్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించకుండానే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు భారీస్థాయిలో మేలు జరుగుతుండటం గమనార్హం.