Sankranthiki Vasthunam Bulliraju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ (Venkatesh)హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమా సంక్రాంతి రోజు రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాను చాలామంది ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు. అలాగే ఈ సినిమాతో వెంకటేష్ మరొకసారి భారీ సక్సెస్ ని సాధించాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అనిల్ రావిపూడి సైతం వరుసగా 8వ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో బుల్లి రాజు(Bulli Raju)అనే ఒక చైల్డ్ క్యారెక్టర్ కి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. ఆ బుడ్డోడు చేసిన కామెడీతోనే సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోయింది అంటూ చాలామంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక దానికి తోడుగా రీసెంట్ గా మహేష్ బాబు (Mahesh Babu) లాంటి స్టర్భేరో సైతం ఈ సినిమా చూశాడు. తాము కూడా బుల్లి రాజు గురించి అడిగి మరీ తనని తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి రాసిన బుల్లి రాజు అనే క్యారెక్టర్ కి రేవంత్ (Revanth) ఆ బుడ్డోడు 100% న్యాయం చేశాడు…
ఇక ఇదిలా ఉంటే బుల్లి రాజుగా పిలవబడుతున్న బుడ్డోడి అసలు పేరు రేవంత్… ఇక రీసెంట్ గా అతన్ని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి నీకు ఈ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందని అడగగా రేవంత్ మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి వీరాభిమాని…
ఎలక్షన్స్ సమయం లో జనసేన పార్టీ తరఫున క్యాంపెనింగ్ చేస్తు జనసేన పార్టీకి ఓటెయ్యండి అంటూ ఇంటింటికి తిరిగి చెప్పాను. ఆ వీడియో చాలా వైరల్ అయింది. అది చూసిన దిల్ రాజు(Dil Raju), అనిల్ రావిపూడి(Anil Ravipudi) గారు నన్ను పిలిపించి నాకు ఆడిషన్ చేశారు. ఇక మొత్తానికైతే నన్ను ఆ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేశారు. ఫైనల్ గా నేను క్యారెక్టర్ లో అలా కనిపించాను అంటూ తన చెబుతూ ఉండటం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా ఆయన చేసిన క్యారెక్టర్ వల్ల సినిమాకి చాలా బూస్టాప్ అయితే వచ్చిందనే చెప్పాలి. దానివల్ల ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా చాలామంది ఆ సినిమాను రిపీటెడ్ గా చూస్తున్నారు అంటే అది ఆ బుల్ రాజు కామెడీ వల్లే అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రేవంత్ సెలబ్రిటీ అయిపోయాడు….