Inspiring Success Story: అందరు కలలు కంటుంటారు. కానీ కొందరే వాటిని నిజం చేసుకుంటారు. జీవితంలో అనుకున్న లక్ష్యం చేరుకనే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని స్థిరపడే వారు కొందరైతే. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించడం చూస్తుంటాం. మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు కలలు కనండి సాకారం చేసుకోండి అనే నానుడిని నిజం చేస్తూ ఆమె జీవితాశయం నెరవేర్చుకుంది. భవిష్యత్ గురించి బెంగ లేకుండా చేసుకుంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చినా భారీ వేతనం పొందుతూ అందరిని ఆశ్చర్య పరుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన స్నేహకిరణ్ అనే యువతికి అమెజాన్ భారీ అవకాశం ఇచ్చింది. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతుండగానే రూ.44 లక్షల వేతనంతో అమెజాన్ కు ఎంపికైంది. కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తండ్రి సింహాచలం జీడిపప్పు కర్మాగారంలో పని చేస్తున్నాడు. స్నేహకిరణ్ ప్రస్తుతం విశాఖ పట్నంలోని ప్రైవేటు కళాశాలలో సీఎస్ ఈ చివరి సంవత్సరం చదువుతోంది.
Also Read: ‘కశ్మీర్ పండింట్లను వాడుకొని దర్శకుడు కోట్లు సంపాదించాడు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
దీంతో భారీ వేతనంతో అమెజాన్ సంస్థ స్నేహకిరణ్ ను ఎంపిక చేసింది. కరోనా సమయంలో ఆన్ లైన్ ద్వారా కోడింగ్ నేర్చుకున్న ఆమెకు అమెజాన్ భారీ ఆఫర్ ఇవ్వడం తెలిసిందే. ఆమెకు చిన్నప్పటి నుంచి గణితం అంటే ఆసక్తి ఉండటంతో సంస్థ ఇంటర్వ్యూలో ఎంపికై జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగింది. తనకు గ్రూప్ డిస్కషన్స్ కూడా తోడ్పడ్డాయని చెబుతోంది.
ప్రతిభ ఉంటే దాని ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది. ఆశయాల సాధనకు అందివచ్చే విధంగా అవకాశాలను తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం స్నేహకిరణ్ విషయంలో కూడా ఇదే నిజమైంది. తాను అనుకున్నది సాధించాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న యువతకు ఉపాధి అవకాశాలు దారులు తెరుస్తున్నాయి. భారీ వేతనంతో స్నేహకిరణ్ అమెజాన్ సంస్థలో ఉద్యోగిగా చేరడంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kurnool District Politics: నేతలు అధికం.. ఉనికి కోసం ఆరాటం