https://oktelugu.com/

Jobs In Indian Army: పది అర్హతతో ఆర్మీ పోస్టల్‌ సర్వీస్‌ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Jobs In Indian Army: ఆర్మీ పోస్టల్‌ సర్వీస్‌ వింగ్‌, బ్రిగేడ్‌ ఆఫ్‌ ది గార్డ్స్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రూప్ సీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 2 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని తెలుస్తోంది. గ్రూస్ సీ (వాషర్‌మ్యాన్‌, గార్డెనర్‌) పోస్టులను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 15, 2022 / 09:49 AM IST
    Follow us on

    Jobs In Indian Army: ఆర్మీ పోస్టల్‌ సర్వీస్‌ వింగ్‌, బ్రిగేడ్‌ ఆఫ్‌ ది గార్డ్స్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రూప్ సీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 2 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని తెలుస్తోంది. గ్రూస్ సీ (వాషర్‌మ్యాన్‌, గార్డెనర్‌) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    Jobs In Indian Army

    Jobs In Indian Army

    మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన అర్హతను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రాత పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది.

    Also Read: Janasena Avirbhava Sabha Highlights: జనసేన పార్టీ ఆవిర్భావ సభ హై లైట్స్

    ఆఫ్‌లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వింగ్‌ కమాండర్‌, ఏపీఎస్‌ వింగ్‌, బ్రిగేడ్‌ ఆఫ్‌ ది గార్డ్స్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ కంప్టీ నాగపూర్‌, మహారాష్ట్ర అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపవచ్చు. 2022 సంవత్సరం మార్చి 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.

    https://indianarmy.nic.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

    Also Read: Ghani Movie Trailer Update: ట్రైలర్ అప్ డేట్ వచ్చింది.. ఇంతకీ మ్యాటర్ ఉంటుందా ?