https://oktelugu.com/

Jobs: బీటెక్, ఎంటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. నెలకు రూ.63,000 జీతంతో జాబ్స్!

Jobs: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. 63,000 భారీ వేతనంతో బీటెక్, ఎంటెక్ చదివిన నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సీనియర్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ లాంగ్వేజెస్ లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 2, 2022 / 08:45 PM IST
    Follow us on

    Jobs: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. 63,000 భారీ వేతనంతో బీటెక్, ఎంటెక్ చదివిన నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సీనియర్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    కంప్యూటర్ లాంగ్వేజెస్ లో నైపుణ్యాలతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. మొత్తం 5 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ఇంటర్వ్యూ, ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్ లైన్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది.

    https://home.iitd.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కనీస వేతనం 31,000 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

    ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. పోస్టులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండనుంది. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని గుర్తుంచుకోవాలి.