Jobs : డిగ్రీతో 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ జాబ్స్‌.. రూ.36,000 వేతనంతో?

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుని ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ లో శిక్షణ తీసుకునే అవకాశం ఉంటుంది. https://www.idbibank.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎవరైతే ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తారో […]

Written By: Navya, Updated On : August 14, 2021 8:43 pm
Follow us on

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుని ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ లో శిక్షణ తీసుకునే అవకాశం ఉంటుంది. https://www.idbibank.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఎవరైతే ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తారో వాళ్లు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. 2021 సంవత్సరం జులై 1 నాటికి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపుగా ఉంటుంది.

ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉండగా ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన తరువాత 36,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఆగష్టు 22వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ కాగా సెప్టెంబర్‌ 04, 2021 పరీక్ష తేదీగా ఉంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రయోజనం చేకూరనుంది.