బీఈసీఐఎల్ నుంచి ఈ మధ్య కాలంలో పలు జాబ్ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 5 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఆఫీసర్ అసిస్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ (హోమియోపతి), కన్సల్టెంట్ (అడ్మిన్) ఉద్యోగ ఖాళీలను జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్, ఎండీ, బీహెచ్ఎంసీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. రాత పరీక్షను నిర్వహించి ఆ పరీక్షలో పాసైన వాళ్లను ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేయడం జరుగుతుంది. 20,976 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు ఎంపికైన అభ్యర్థులు వేతనంగా చెల్లిస్తారు.
2021 సంవత్సరం నవంబర్ 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.becil.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.