Covid Schools: కరోనా ఎఫెక్ట్: స్కూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Covid Schools: అంతా అనుకున్నట్టే అయ్యింది. కరోనా మహమ్మారి దెబ్బకు మరోసారి స్కూళ్లు మూతపడ్డాయి. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. దీంతో ముచ్చటగా మూడు నెలలు కూడా నడవకుండానే మూత‘బడులు’ అయ్యాయి. గత నవంబర్ లో కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణలో స్కూళ్లను ఓపెన్ చేసింది ప్రభుత్వం.. నవంబర్, డిసెంబర్ నెల నడిచాయి. జనవరి సంక్రాంతి సెలవులతో స్కూళ్లకు సెలవులొచ్చాయి. ఇప్పుడు కరోనా దెబ్బకు సెలవులు పొడిగించేశారు. తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో […]

Written By: NARESH, Updated On : January 16, 2022 11:37 am
Follow us on

Covid Schools: అంతా అనుకున్నట్టే అయ్యింది. కరోనా మహమ్మారి దెబ్బకు మరోసారి స్కూళ్లు మూతపడ్డాయి. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. దీంతో ముచ్చటగా మూడు నెలలు కూడా నడవకుండానే మూత‘బడులు’ అయ్యాయి.

గత నవంబర్ లో కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణలో స్కూళ్లను ఓపెన్ చేసింది ప్రభుత్వం.. నవంబర్, డిసెంబర్ నెల నడిచాయి. జనవరి సంక్రాంతి సెలవులతో స్కూళ్లకు సెలవులొచ్చాయి. ఇప్పుడు కరోనా దెబ్బకు సెలవులు పొడిగించేశారు.

తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. రేపటి నుంచి అంటే 17వ తేదీ నుంచి పాఠశాలలు మొదలు కావాల్సి ఉంది. అయితే తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో ప్రభుత్వం సెలవులు పొడిగించాలని వైద్య ఆరోగ్యశాఖ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశాఖ సిఫార్సు మేరకు ఈనెల 30 వరకూ సెలవులు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెలాఖరు వరకూ తెలంగాణలో స్కూళ్లు తెరిచే అవకాశాలు లేవని తేలిపోయింది. ఇక ఆన్ లైన్ ద్వారానే క్లాసులు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ రోజులు ఇలా సాగితే పిల్లల చదువులు ప్రమాదంలో పడుతాయి. వారికి సరిగ్గా విద్యాబోధన అందదు.

మరి ఆన్ లైన్ క్లాసులు కొనసాగిస్తారా? ఈనెల 30 తర్వాత ప్రత్యక్ష క్లాసులు ప్రారంభిస్తారా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఈ 13 రోజులు మాత్రం సెలవుల కిందే లెక్క.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో వారు సంక్రాంతికి వెళ్లిన వారు తిరిగి రావాలా? ఊళ్లోనే ఉండాలా? అన్నది నిర్ణయించుకుంటారు.

ఇక రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటి కానుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత.. నియంత్రణ చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.