AP Volunteer Jobs: ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా 7,218 గ్రామ, వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టులలో గ్రామాల్లో 4213 ఖాళీలు ఉండగా పట్టణాల్లో 3005 ఖాళీలు ఉన్నాయని తెలుస్తోంది. ఏపీలో పలు ప్రాంతాల్లో వాలంటీర్లు లేకపోవడంతో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు.
ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందేలా చేయడంలో వాలంటీర్లు కీలక పాత్రను పోషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను యూనిట్ గా తీసుకుని వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని వెల్లడించిందని సమాచారం అందుతోంది. ఇకపై ప్రతి నెలలో గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం రెండుసార్లు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. విధులకు హాజరు కాని వాలంటీర్లను తొలగించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారని సమాచారం.
Also Read: కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఎంట్రీ కావాలంటే?
వాలంటీర్ల నియామకంలో ప్రభుత్వం 50 శాతం పోస్టులను మహిళలకు కేటాయించినట్టు సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 5,000 రూపాయల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ప్రజలకు సేవ చేయాలనే భావనను కలిగి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుసగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతూ ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.
Recommended Video: