RLDA Recruitment: రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 45 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
సివిల్ విభాగంలోని అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ లేదా బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీటెక్ అర్హతతో పాటు గేట్ లో అర్హత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. భారీ వేతనంతో?
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. డిసెంబర్ 23వ తేదీ ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీగా ఉంది. https://rlda.indianrailways.gov.in./ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.
వరుసగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతూ ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: భారత ప్రభుత్వ మింట్ లో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.90 వేల వేతనంతో?