నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ప్రముఖ సంస్థలలో ఒకటైన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 116 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ, బీబీఏ, బీకామ్, లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ ఉన్నవాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల […]

Written By: Navya, Updated On : November 7, 2021 5:28 pm
Follow us on

ప్రముఖ సంస్థలలో ఒకటైన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 116 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ, బీబీఏ, బీకామ్, లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ ఉన్నవాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. డీఆర్డీవో ఉద్యోగ ఖాళీలకు 2021 సంవత్సరం నవంబర్ 15వ తేదీ చివరి తేదీగా ఉంది. మొత్తం 116 ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 50, టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 40, ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 26 ఉన్నాయి.

విద్యార్హతలను బట్టి పోస్టులలో మార్పులు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. rac.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2021 సంవత్సరం నవంబర్ 1వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం నవంబర్ 15 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

డీఆర్డీవో 2021 సంవత్సరంకు సంబంధించి ఖాళీలకు బట్టి అకాడమిక్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 06782-272144 నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందవచ్చు. hrd@itr.drdo.in ఈ మెయిల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.