Summer Holidays: తెలంగాణలో భానుగు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు మార్చిలోనే మాడు పగులగొడుతున్నాయి. దీంతో విద్యాశాఖ ఈసారి ఒంటిపూట బడులను ముందే ప్రకటించింది. ప్రస్తుతం హాఫ్‌డే స్కూల్స్‌కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ మరో కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠవాలలకు ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 24 చివరి వర్కింగ్ డేగా నిర్ణయించింది.
మార్చి 15 నుంచే హాఫ్‌డే..
ఎండల తీవ్రత నేపథ్యంలో విద్యాశాఖ మార్చి 15 నుంచే రాష్ట్రంలో ఒంటిపూట బడులు అమలు చేస్తోంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. తర్వాత మధ్యాహ్న భోజనం చేసి ఇంటికి వెళ్తున్నారు విద్యార్థులు. ఏప్రిల్ 24న పాఠశాలలకు చివరి వర్కింగ్‌డే. వేసవి దృష్ట్యా రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలని భావిస్తోంది.
ఏప్రిల్ 25 నుంచిహాలీడేస్?
ఏప్రిల్ 25 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే 9వ తరగతి సిలబస్ పూర్తిచేసి 10వ తరగతి సిలబస్ స్టార్ట్ చేశారు. అయితే సెలవుల్లో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
జూన్ 12న రీ ఓపెన్?
పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండే అవకాశం ఉంది. జూన్ 12న పాఠశాలలు రీ ఓపెన్ అవుతాయని సమాచారం. రీఓపెన్ నాటికి అన్ని పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫాంలు సరఫరా చేసేలా కసరత్తు కూడా చేస్తోంది. ఇప్పటికే యూనిఫాం కుట్టే బాధ్యతను ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించింది. పుస్తకాలను కూడా విద్యాశాఖ సిద్ధంచేస్తోంది.