Return To Office: కరోనా కల్లోలం సృష్టించిన నష్టం అంతా ఇంత కాదు. ఏకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసింది. దీంతో కొందరు ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్ల మీద పడితే మరికొందరు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం పనులు చేస్తున్నారు. దాదాపు రెండున్నరేళ్లు ఇలా ఇంటి నుంచి పని చేయడంతో వారికి బద్దకం అలవాటైంది. ప్రస్తుతం అన్ని సంస్థలు ఉద్యోగులను ఇక ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇన్నాళ్లు హాయిగా ఇంట్లో కూర్చుని పని చేసినా ఇప్పుడు మళ్లీ కార్యాలయాలకు రమ్మని పిలవడంతో ఏం చేయాలనే ఆందోళన సహజంగానే మొదలైంది.
అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కడ పని చేసినా కంఫర్ట్ గానే ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉండి పనిచేయడంతో కాస్త లావయ్యారు. ఇక ఆఫీసుకు వెళ్లి దాదాపు 7-8 గంటలు ఒకే చోట కూర్చుని పనిచేయాలంటేనే బోరు కొడుతుందని కొందరు చెబుతున్నారు. కానీ అది మన ఉద్యోగ ధర్మం. తవ్వెడు ఇచ్చిన కాడ తంగేళ్లు పీకాలి అన్నట్లు మనకు జీతం ఇచ్చేటప్పుడు వారు చెప్పింది చేయాలి. దాని కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.
Also Read: Krithi Shetty: ప్చ్.. తత్త్వం బోధపడింది.. మళ్లీ ప్రాకులాడుతుంది
ఎప్పుడైనా ఆఫీసుకు వెళ్లేటప్పుడు లిఫ్ట్ ను వాడకండి. మెట్ల ద్వారా వెళ్లండి అలా వ్యాయామం చేసినట్లు అవుతుంది. గంటల తరబడి సీట్ల కూర్చోకుండా అప్పుడప్పుడు లేచి అటూ ఇటూ నడవండి. మధ్యాహ్న భోజనానికి వెళ్లేటప్పుడు కూడా నడుస్తూనే వెళ్లండి. ఇక కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్, స్నాక్స్ కు దూరంగా ఉండండి. ఇంట్లో తయారు చేసిన వాటిని తినండి. అప్పుడే మనకు ఆరోగ్యం అదుపులో ఉంటుంది.
ఆలస్యంగా ఇంటికి వస్తూ రాత్రిళ్లు నిద్ర పోకుండా సెల్ ఫోన్లు వాడకండి. తద్వారా నిద్ర పోకుండా ఉంటే ఇంకా రోగాలు పెరుగుతాయి. రోజుకు కనీసం ఆరేడు గంటలు నిద్ర పోయేలా చూసుకోండి. ఎండా కాలం కావడంతో ఎక్కువగా నీరు తాగాలి. ప్రతి గంటకోసారి నీరు తాగితేనే శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. పుచ్చకాయ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు తరచుగా తీసుకోవాలి. అప్పుడే మనకు శక్తి వస్తుంది.
ఆఫీసు వ్యవహారాలే కాకుండా కుటుంబ పరిస్థితులను కూడా పట్టించుకోవాలి. అప్పుడప్పుడు బంధువులతో సరదాగా మాట్లాడుతూ ఒత్తిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇలా చిన్న చిన్న ట్రిక్కులు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవితం సాఫీగా సాగుతుంది.
Also Read:KTR- Congress Party: కాలం చెల్లిన పార్టీతో పొత్తా? కాంగ్రెస్ కు చురకలంటించిన కేటీఆర్
Recommended Videos: