https://oktelugu.com/

Study: ఆరేళ్లకు ఫస్ట్ క్లాస్.. ఇలా అయితే చదువులు ఎలా సాగుతాయి?

Study: నాలుగు, ఐదు సంవత్సరాలకు పిల్లలకు పాఠశాలలో చేర్చుతామంటే ఇక కుదరదు. కరెక్ట్ గా ఆరేళ్లు నిండితే కానీ చేర్పించడానికి వీలులేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేయాలని ఆదేశించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తప్పనిసరి కూడా చేసింది.ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పిల్లలను రెండేళ్లకే అంగన్ వాడీ కేంద్రాలకు పంపించి…నాలుగో ఏటకు వచ్చేసరికి పాఠశాలలో చేర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కార్పొరేట్ స్కూల్స్ గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ లక్షలకు […]

Written By:
  • Dharma
  • , Updated On : March 6, 2023 / 10:46 AM IST
    Follow us on

    Study: నాలుగు, ఐదు సంవత్సరాలకు పిల్లలకు పాఠశాలలో చేర్చుతామంటే ఇక కుదరదు. కరెక్ట్ గా ఆరేళ్లు నిండితే కానీ చేర్పించడానికి వీలులేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేయాలని ఆదేశించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తప్పనిసరి కూడా చేసింది.ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పిల్లలను రెండేళ్లకే అంగన్ వాడీ కేంద్రాలకు పంపించి…నాలుగో ఏటకు వచ్చేసరికి పాఠశాలలో చేర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కార్పొరేట్ స్కూల్స్ గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ లక్షలకు లక్షల ఫీజులతో పాటు ముందస్తుగానే సీటు అడ్మిషన్ కోసం పోటీ పడుతున్న రోజులివి. అటువంటి పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చినట్టయ్యింది.

    Also Read: Influenza: దగ్గు తగ్గడం లేదు.. జలుబు వీడటం లేదు: బాబోయ్ ఇది మామూలు మొండి వైరస్ కాదు

    అయితే పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం ప్రభుత్వపరంగా అంగన్ వాడీ కేంద్రాలు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నాయి. కానీ అక్కడ బోధన అంతంతమాత్రమే. బోధనేతర అంశాలైన పౌష్టికాహారం పంపిణీ వంటి వాటికే అక్కడ సిబ్బంది పరిమిమితమవుతున్నారు. అటు వారికి బోధనాపరమైన శిక్షణ కూడా ఇవ్వడం లేదు. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు ఎలా అమలవుతాయన్నది ప్రశ్నే.

    ఒకటో తరగతికి ఆరో సంవత్సరం ప్రామాణికంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుంది. పిల్లలు మరో ఏడాది పాటు అదనంగా చదువుకోవాల్సి ఉంటుంది. నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీలకే కొన్ని ప్రైవేటు పాఠశాలలు లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి. అక్కడ చదివితే పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఎక్కువ మంది భావిస్తారు. అయితే ఇటువంటి వారు ఆరేళ్ల ప్రమాణికంతో ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం విద్యార్థుల వయసును కటాఫ్ గా సెప్టెంబరు 1ను తీసుకోవాలని ఆదేశించింది. కానీ కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం మార్చి 1, జూన్ 1ని కటాఫ్ గా నిర్ణయించి పిల్లలను చేర్చుకుంటున్నాయి.

    తాజాగా కేంద్రం తన ఆదేశాలను అమలు చేయకుంటే మాత్రం జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షల సమయంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. ఇది కూడా విద్యార్థుల తల్లిదండ్రల ఆందోళనకు కారణం. ఇటీవల జేఈఈ, నీట్ లను టార్గెట్ గా చేసుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్చుతున్నారు. అటు సామాన్యులు సైతం గ్రామాల్లో పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలతో పునరాలోచనలో పడుతున్నారు.

    Also Read: Janhvi Kapoor: అతిపెద్ద సమస్యలో జాన్వీ కపూర్… హీరో రానా హెల్ప్!

    Tags