ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 237 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో 237 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఆగష్టు 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. https://www.esic.nic.in/recruitments వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 237 ఉద్యోగ ఖాళీలలో ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీలు 53 ఉన్నాయి.
మిగిలిన ఉద్యోగ ఖాళీలలో సూపర్ స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలు 24, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీలు 124, జూనియర్ రెసిడెంట్ ఉద్యోగ ఖాళీలు 36 ఉన్నాయి. పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.