ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన విప్రో సంస్థ బీటెక్ చివరి సంవత్సరం, ఎంటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ పేరుతో విప్రో పరీక్షలు నిర్వహించనుంది. విప్రో సంస్థ ఆన్ లైన్ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తుండగా ఉద్యోగాలకు ఎంపికైన వారికి మూడున్నర లక్షల రూపాయలు వేతనంగా లభిస్తుంది.
Also Read: నిరుద్యోగులకు ఎల్‌అండ్‌టీ శుభవార్త.. 1100 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..!
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి, ఇంటర్ లలో కనీసం 60 శాతం మార్కులు, బీటెక్ లో 65 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 5వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆసక్తి ఉన్న ఫైనలియర్ విద్యార్థులు https://careers.wipro.com/elite ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: వారికి ఎంఎస్ఎంఈ శుభవార్త.. భారీ వేతనంతో నోటిఫికేషన్ విడుదల..!
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 18వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ మధ్య అసెస్‌మెంట్ పరీక్షలు జరుగుతాయి. ఆన్ లైన్ అసెస్‌మెంట్ పరీక్ష దాదాపు రెండు గంటల పాటు ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్, రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్, ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని కోడింగ్ పై పట్టు ఉంటే ఈ ఉద్యోగాలకు సులభంగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే నాటికి విద్యార్థులకు ఎటువంటి బ్యాక్ లాగ్స్ ఉండకూడదు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు కంపెనీలో సంవత్సరం పాటు పని చేయాల్సి ఉంటుంది.