
ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. బోధన సిబ్బంది నియామకాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్‌తో పాటు షిల్లాంగ్, లక్నో క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌తోపాటు, బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయనుండటం గమనార్హం. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మే నెల 18వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.efluniversity.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 33 ఉద్యోగ ఖాళీలలో ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 5 ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్ల ఉద్యోగ ఖాళీలు 10, అసోసియేట్ ప్రొఫెసర్లు 8, ప్రొఫెసర్లు 5, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక ఉద్యోగ ఖాళీ ఉంది. పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
https://www.efluniversity.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవక్ఛు.