
డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (డీఎస్‌ఎస్‌సీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 83 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పది, ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనో, ఎల్‌డీసీ, సివిల్ మోటార్, ఎంటీసీ, ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 22వ తేదీ లోపు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.
రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. http://dssc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమిళనాడు రాష్ట్రంలో పని చేయాల్సి ఉంటుంది. మొత్తం 83 ఉద్యోగ ఖాళీలలో మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 60, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ ఖాళీలు 10, సివిలియన్ మోటార్ డ్రైవర్ ఉద్యోగ ఖాళీలు 7, స్టెనోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు 4, సుఖాని 1, కార్పెంటర్ 1 ఉన్నాయి.
రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుండగా ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులోని విద్యార్హతల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను రాతపరీక్షకు ఎంపిక చేస్తారు. పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, ట్రేడ్ స్పెసిఫిక్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని సమాచారం.
http://dssc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉండగా అర్హతను బట్టి ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.