TS DSC Notification: ఉపాధ్యాయ ఉద్యోగార్థులారా త్వరపడండి.. సీట్‌ బుక్‌ చేసుకోండి..!

2017 తర్వాత తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్‌ రాలేదు. గతేడాది కేసీఆర్‌ సర్కార్‌ 5,089 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే పరీక్ష సమయానికి ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. దీంతో గత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కొత్త ప్రభుత్వం మరిన్ని పోస్టులు కలిపి కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.

Written By: Raj Shekar, Updated On : March 12, 2024 11:26 am

TS DSC Notification

Follow us on

TS DSC Notification: తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే మెగా డీఎస్సీ ప్రకటించింది. 11,062 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి 4 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఏప్రిల్‌ 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే చాలా మంది ప్రిపరేషన్‌ కూడా మొదలు పెట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది.

చాలా ఏళ్ల తర్వాత..
2017 తర్వాత తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్‌ రాలేదు. గతేడాది కేసీఆర్‌ సర్కార్‌ 5,089 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే పరీక్ష సమయానికి ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. దీంతో గత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కొత్త ప్రభుత్వం మరిన్ని పోస్టులు కలిపి కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. గతేడాది దరఖాస్తు చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతో చాలా ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్‌తో ఉద్యోగార్థులు సంతోషంలో ఉన్నారు.

పోస్టులు ఇలా..
గతేడాది 5,089 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇవ్వగా ప్రస్తుతం 11,062 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో స్కూల్‌ అíసిస్టెంట్‌ పోస్టులు 2,629, భాషా పండితులు 727,^è పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508 పోస్టులు ఉన్నాయి. ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 220, ఎస్జీటీ పోస్టులు 796 ఉన్నాయి.

ఉచితంగా కోచింగ్‌..
మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన రేవంత్‌ సర్కార్‌ తాజాగా ఉద్యోగార్థులకు మరో తీపికబురు చెప్పింది. డీఎస్సీకి ప్రిపేర్‌ అవుతున్న వారికి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఫ్రీ కోచింగ్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేకు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లలో డీఎస్సీ కోచింగ్‌ ఇవ్వనున్నారు. మార్చి 26 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. www.tsbcstudycircle.cgg.gov.in వెబ్‌ సైట్‌లోకి వెళ్లి ఉచిత కోచింగ్‌ అప్లై చేసుకోవచ్చి తెలుపుతూ ఆఫీసియల్‌ స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు. అయితే ఈ అప్లికేషన్స్‌ మార్చి 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మాత్రమే తీసుకుంటామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 040 – 24071178, 040 – 27077929 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్‌ అర్హత సాధించిన వారు 4 లక్షల మంది ఉన్నారు. వారంతా డీఎస్సీ రాయనున్నారు.