https://oktelugu.com/

Jobs: ఇంటర్ అర్హతతో రూ. లక్షకుపైగా వేతనంతో జాబ్స్.. ఎలా పొందాలంటే?

Jobs: ఏపీలోని కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ ఆఫీసర్, ఎపిడెమాలజిస్ట్, ఓటీ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులతో పాటు స్పెషల్ ఎంవో, డెంటల్ టెక్నీషియన్, అప్థోమెట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 12,000 రూపాయల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 5, 2022 / 04:30 PM IST
    Follow us on

    Jobs: ఏపీలోని కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ ఆఫీసర్, ఎపిడెమాలజిస్ట్, ఓటీ టెక్నీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులతో పాటు స్పెషల్ ఎంవో, డెంటల్ టెక్నీషియన్, అప్థోమెట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 12,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వేతనం లభించనుంది. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ, ఎంఏ, పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్, డిప్లొమా లేదా ఇంటర్, ఓటీ టెక్నాలజీ కోర్సు, డెంటల్ టెక్నీషియన్ కోర్సు, పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు.

    2022 సంవత్సరం జులై 1వ తేదీనాటికి 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సాంకేతిక పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, అకడమిక్ మెరిట్, విద్యార్హత ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తుకు చివరి తేదీగా ఉంది.

    జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ఇతర అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.