
హైదరాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 75 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 29వ తేదీలోగా ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
https://hyderabad.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎంబీబీఎస్ పాస్ కావడంతో పాటు ఏపీ లేదా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిష్టర్ అయినవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
అకడమిక్ మార్కులు, వయస్సు ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు గాను 90 మార్కులు.. వయసుకి 10 మార్కులు కేటాయించి ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. seminar hall, o/o the dm&ho, 4th floor, harihara kala bhavan, patny, secunderabad అడ్రస్ వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
https://hyderabad.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది.