https://oktelugu.com/

CSIR – CEERI Recruitment 2022: పది అర్హతతో ప్రముఖ సంస్థలో 35 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

CSIR – CEERI Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 35 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలతో పాటు టెక్నికల్ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 35 ఉద్యోగ ఖాళీలలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 8, 2022 2:39 pm
    Follow us on

    CSIR – CEERI Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 35 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలతో పాటు టెక్నికల్ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    CSIR - CEERI Recruitment 2022

    CSIR – CEERI Recruitment 2022

    మొత్తం 35 ఉద్యోగ ఖాళీలలో టెక్నీషియన్ పోస్టులు 24 ఉండగా టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులు 11 ఉన్నాయి. పదో తరగతి కనీసం 55 శాతం మార్కులతో పాసై ఐటీఐ లేదా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్‌లో నేషనల్ లేదా స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ను కలిగి ఉన్నవాళ్లు టెక్నీషియన్-సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి లేదా తత్సమాన సబ్జెక్టులలో 55 శాతం ఉత్తీర్ణతతో పాటు అప్రెంటిస్ ట్రైనీగా రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్ ట్రేడ్‌లో 3 ఏళ్ల పని అనుభవం ఉన్నవాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 2022 సంవత్సరం మార్చి 1వ తేదీ నాటికి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. స్కిల్ టెస్ట్, షార్ట్ లిస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: కేసీఆర్ పై రాజ‌ద్రోహం కేసు పెట్టేందుకు బీజేపీ రెడీ

    జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుంది. మాజీ సైనికులు/మహిళా అభ్యర్ధులకు, పీడబ్ల్యూబీడీ/సీఎస్‌ఐఆర్‌ అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీలకు ఈ ఉద్యోగ ఖాళీలకు ఫీజు మినహాయింపు లభించనుంది. 2022 సంవత్సరం మార్చి 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది.

    https://www.ceeri.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పచ్చు. నిరుద్యోగులకు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

    Also Read: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపెవరిది?