Cochin Shipyard Recruitment 2022: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ తాజాగా రిలీజైంది. కొచ్చిన్ షిప్‌యార్డ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీని చేపట్టగా అర్హులైన వాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మొత్తం 3 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. నర్సరింగ్ కమ్ ఫస్ట్ ఎయిడర్, ఫార్మసిస్ట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
2022 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీనాటికి 56 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 20,200 రూపాయల నుంచి 24,800 రూపాయల వరకు వేతనంగా లభించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏడో తరగతి, ఫార్మసీ డిప్లొమాలో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: అసెంబ్లీ సమావేశాలకు బద్దకమేనా ప్రజాప్రతినిధులూ?
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. మొత్తం 50 మార్కులకు పరీక్ష జరగనుండగా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలు కూడా ఉంటాయని సమాచారం. ఫిబ్రవరి 24వ తేదీన ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూ జరగనుంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: కరోనా ముంచింది.. ఏం చేస్తాం చెప్పండి.. విస్తారా సీఈవో లేఖ వైరల్
https://cochinshipyard.in/welcome వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఇవి కూడా చదవండి:
1. యూపీ అభ్యర్థుల్లో నేరస్తులు, కోటీశ్వరులే ఎక్కువా?
2. మేడారానికి కేసీఆర్.. అమ్మవార్ల కోసం నిర్ణయం
3. రివ్యూ : “సన్ ఆఫ్ ఇండియా”
4. చిరంజీవి, సురేఖల పెండ్లి ఫొటోను చూశారా.. చిరిగిన చొక్కాతోనే తాళి కట్టిన మెగాస్టార్..!