కోల్ ఇండియా లిమిటెడ్ గతంలో పలు జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చిన సంగతి తెలిసిందే. తాజాగా కోల్ ఇండియా లిమిటెడ్ మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 588 మేనేజ్ మెంట్ ట్రెయినీ ఉద్యోగ ఖాళీల కొరకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. గేట్ స్కోర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.
ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.coalindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఈ వెబ్ సైట్ ద్వారానే ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో మైనింగ్ విభాగంలో 253 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
మెకానికల్ విభాగంలో 134 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎలక్ట్రికల్ విభాగంలో 117 ఉద్యోగ ఖాళీలు, మిగిలిన విభాగాల్లో ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. బీఈ, బీటెక్, బీఎస్సీ, జియాలజీలో ఎంఎస్సీ, ఎంటెక్ చేసిన వాళ్లు ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోల్ ఇండియా ఉద్యోగులకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులకు 1000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది.
ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది.