https://oktelugu.com/

Jobs: చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.2 లక్షల వేతనంతో?

Jobs: చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు, అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. డిజైన్‌, క్వాలిటీ అష్యూరెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్, సేఫ్టీ, అండర్‌గ్రౌండ్‌ కన్‌స్ట్రక్షన్, ఇతర విభాగాలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. 30 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని 19 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 10, 2022 / 09:08 PM IST
    Follow us on

    Jobs: చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు, అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. డిజైన్‌, క్వాలిటీ అష్యూరెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్, సేఫ్టీ, అండర్‌గ్రౌండ్‌ కన్‌స్ట్రక్షన్, ఇతర విభాగాలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. 30 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.

    కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని 19 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. అసిస్టెంట్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

    సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆఫ్‌లైన్‌ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జాయింట్ జనరల్‌ మేనేజర్ (హెచ్‌ఆర్‌) చెన్నై అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.

    అర్హత, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. https://chennaimetrorail.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 60,000 రూపాయల నుంచి 2,25,000 రూపాయల వరకు వేతనం పొందే అవకాశం ఉంటుంది.