https://oktelugu.com/

Jobs: కోల్‌ ఇండియాలో నెలకు రూ.లక్ష వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. డిగ్రీ అర్హతతో?

Jobs:  కోల్‌కతాలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. 14 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా చీఫ్‌ మేనేజర్‌ (సెక్యురిటీ)/ఈ7 గ్రేడ్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు జనరల్‌ మేనేజర్‌ (సెక్యురిటీ)/ఈ8 గ్రేడ్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 12, 2022 / 10:14 AM IST
    Follow us on

    Jobs:  కోల్‌కతాలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. 14 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా చీఫ్‌ మేనేజర్‌ (సెక్యురిటీ)/ఈ7 గ్రేడ్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు జనరల్‌ మేనేజర్‌ (సెక్యురిటీ)/ఈ8 గ్రేడ్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 1,00,000 రూపాయల నుంచి 2,15,900 రూపాయల వరకు వేతనంగా లభించనుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ నాటికి 62 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

    ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆఫ్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సంస్థ కోల్ కతా అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. 2022 సంవత్సరం మార్చి 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉండనుంది.

    https://www.coalindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.