CBSE 10 Class Result: కార్పొరేట్ కళాశాల వల్ల మార్కులే కొల బద్దగా చదువులు సాగుతున్నాయి. దీనివల్ల విద్యార్థుల్లో తెలియని ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో పరీక్షల సమయంలో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పరీక్షల్లో తప్పుతున్నారు కూడా. ఇలాంటప్పుడు వారిలో ఆత్మ న్యూనతా భావం పెరిగిపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. కన్నవాళ్ళకు తీరని శోకాన్ని మిగులుచుతున్నారు. నేటి పోటీ ప్రపంచంలో మార్కులు అవసరమే అయినప్పటికీ.. ఒక స్థాయి వరకు వస్తే సరిపోతుంది. కాకపోతే ఈ విషయాన్ని కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు చెప్పవు.. తల్లిదండ్రులు అంగీకరించరు. కానీ అంతిమంగా ఇబ్బంది పడేది మాత్రం విద్యార్థులే. అందుకే పరీక్షల సమయంలో విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచకుండా.. మార్కులను టార్గెట్ గా విధించకుండా ఉంటే బాగుంటుంది. నేటి పోటీ ప్రపంచంలో అందరూ విద్యార్థులు ఒకే విధంగా చదవరు. ఒకే తీరుగా మార్కులు సాధించలేరు. ఇలాంటప్పుడే తల్లిదండ్రులు కాస్త సమయమనం పాటించాలి. విద్యార్థుల పరిజ్ఞానం ఆధారంగా మసులుకోవాలి. ముఖ్యంగా పరీక్షా ఫలితాల సమయంలో వారు తక్కువ మార్కులు సాధించినా సరే దూషించకూడదు. దండించకూడదు. అప్పుడే విద్యార్థుల్లో ఆత్మ న్యూనతా భావం తగ్గిపోతుంది. అంతిమంగా వారు మెరుగైన మార్కులు సాధించేలాగా తోడ్పడుతుంది.
Also Read: పది”లో వైభవ్ సూర్య వంశీ ఫెయిల్.. ఇదీ అసలు జరిగింది!
ఇక ఇటీవల మన దేశంలో సీబీఎస్ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతానికి చెందిన శివం అనే విద్యార్థి బార్డర్ మార్కులతో పాస్ అయ్యాడు. వాస్తవానికి ఈ స్థాయిలో మార్కులు సాధిస్తే ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లాడిని దూషిస్తారు. కోపం పెరిగిపోయిదండిస్తారు. కానీ శివం తల్లిదండ్రులు అలా చేయలేదు. పైగా అతడికి ఘన సన్మానం చేశారు. కాలనీలో పెద్ద పండుగన చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి స్వీట్లు ఇచ్చారు. రంగులు చల్లుతూ.. బ్యాండ్ మేళంతో అతడిని ఇంటిదాకా తీసుకొచ్చారు.. వాస్తవానికి శివం పాస్ అవడం అతడి తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎందుకంటే శివానికి చదువు అంటే మొదటి నుంచి కూడా పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కనీసం పదవ తరగతి వరకు అయినా చదవాలి అనే ఉద్దేశంతోనే అతడిని సీబీఎస్ఈ విధానంలో చదివిస్తున్నారు. అయితే ఎన్నడూ కూడా శివం మీద తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురాలేదు. కచ్చితంగా పాస్ కావాల్సిందేనని ఇబ్బంది పెట్టలేదు. అతడికి చదువుకునే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించారు. దీంతో అతడు ఒత్తిడి లేకుండానే పరీక్షలు రాశాడు. చివరికి బార్డర్ మార్కులతో పాస్ అయ్యాడు. దీంతో అతడి కుటుంబం భారీగా వేడుకలు నిర్వహించింది. స్వీట్లు పంచుతూ సందడి చేసింది..” పాస్ అవడు అని అనుకున్నాం. కానీ అతడు మా అంచనాలను తలకిందులు చేశాడు. అందుకోసమే సంతోషంతో ఇలా చేశాం. మా కొడుకు ఇప్పుడు మాకు మరింత అందంగా కనిపిస్తున్నాడు. మరింత గొప్పగా దర్శనమిస్తున్నాడు. అతడిక జీవితంలో స్థిరపడతాడని నమ్మకం మాకు ఉందని” శివం తండ్రి చెబుతున్నాడు.
View this post on Instagram