బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు తాజాగా ప్రయోజనం చేకూరే విధంగా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను ప్రకటించింది. మొత్తం 269 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. యువతీయువకులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా నియామక ప్రక్రియ పూర్తయ్యే సమయానికి పోస్టుల సంఖ్య పెరిగే లేదా తగ్గే అవకాశాలు ఉంటాయి.
ఆగష్టు నెల 9వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా సెప్టెంబర్ 22వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://rectt.bsf.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పది పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో పాల్గొన్నవారు, మెడల్స్ సాధించినవారు, ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 170 సెంటీమీటర్లు ఉన్న పురుషులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు కనీసం 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి రూ.69,100 వేతనం లభించే అవకాశం అయితే ఉంటుంది.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.