https://oktelugu.com/

BEL Recruitment: మచిలీపట్నం బెయిల్ లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ జాబ్స్.. భారీ వేతనంతో?

BEL Recruitment: భారత ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ తాజాగా నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఏపీలోని మచిలీపట్నంలో ఉన్న యూనిట్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీగా మేలు జరగనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2021 / 09:04 AM IST
    Follow us on

    BEL Recruitment: భారత ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ తాజాగా నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఏపీలోని మచిలీపట్నంలో ఉన్న యూనిట్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీగా మేలు జరగనుంది.

    BEL Recruitment

    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తం 15 ఉద్యోగ ఖాళీలలో మెకానికల్ ఉద్యోగ ఖాళీలు 6, ఎలక్ట్రానిక్స్‌ ఉద్యోగ ఖాళీలు 6, కంప్యూటర్‌ సైన్స్‌ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజనీరింగ్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు సంబంధిత పనిలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.

    Also Read: సికింద్రాబాద్‌ రైల్వేలో 81 జూనియర్‌ ఇంజినీర్‌ జాబ్స్.. భారీ వేతనంతో?

    2021 సంవత్సరం నవంబర్ 1వ తేదీ నాటికి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తులను మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, రవీంద్రనాథ్‌ టాగూర్‌ రోడ్‌, మచిలీ పట్నం 521001, ఆంధ్రప్రదేశ్‌ అడ్రస్ కు పంపాలి. అకడమిక్‌లో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    https://www.bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

    Also Read: ఇన్‌కమ్‌ట్యాక్స్‌లో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.80 వేలకు పైగా వేతనంతో?