Jobs: హైదరాబాద్ లో గ్రూప్‌ సీ, డీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పది, ఇంటర్ అర్హతతో?

Jobs: హైదరాబాద్‌లోని ఆర్టిలెరీ సెంటర్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రూప్‌ సీ, డీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 8 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలలో పోస్టుల ఆధారంగా వేతనంలో మార్పులు ఉంటాయి. మెట్రిక్యులేషన్, తత్సమాన అర్హత ఉన్నవాళ్లు […]

Written By: Kusuma Aggunna, Updated On : March 27, 2022 9:10 am
Follow us on

Jobs: హైదరాబాద్‌లోని ఆర్టిలెరీ సెంటర్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రూప్‌ సీ, డీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 8 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలలో పోస్టుల ఆధారంగా వేతనంలో మార్పులు ఉంటాయి.

మెట్రిక్యులేషన్, తత్సమాన అర్హత ఉన్నవాళ్లు డ్రాప్ట్స్‌ మ్యాన్‌ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100 వరకు వేతనంగా లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎంటీఎస్ పోస్టులకు కూడా ఇవే విద్యార్హతలు ఉండగా నెలకు 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.

బూట్‌ మేకర్‌ పోస్టులకు కూడా ఇవే విద్యార్హతలు ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200 వరకు వేతనంగా లభిస్తుంది. ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఎండీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ.19,900ల నుంచి రూ.63,200 వేతనం లభించనుంది. రాత పరీక్ష లేదా స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.

ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థ హైదరాబాద్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి. 2022 సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. https://joinindianarmy.nic.in/authentication.aspx వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.