https://oktelugu.com/

Jobs: ఇండియన్ ఆర్మీలో గ్రూప్ సీ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. పది అర్హతతో?

Jobs: ఇండియన్ ఆర్మీకి సంబంధించిన బీహార్ రెజిమెంటల్ సెంటర్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 18,000 రూపాయల నుంచి 56,900 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 17, 2022 / 05:54 PM IST
    Follow us on

    Jobs: ఇండియన్ ఆర్మీకి సంబంధించిన బీహార్ రెజిమెంటల్ సెంటర్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు వేతనం లభించనుంది.

    ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://indianarmy.nic.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 2022 సంవత్సరం మే 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. స్క్రిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.

    సఫాయివాలా, కుక్, వాషర్ మేన్, బార్బర్, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సంబంధిత రంగాలలో ఏడాది నుంచి మూడేళ్ల వరకు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

    అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.