భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.
నోటిఫికేషన్ లో భాగంగా టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం 11 ఉద్యోగ ఖాళీలలో పర్సనల్ అసిస్టెంట్–01, ఇంజనీరింగ్ అసిస్టెంట్–02, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్–02, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)–02, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్–04 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్ట్ లో ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత పనిలో అనుభవం, టైపింగ్ నైపుణ్యాలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. 27 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది
సెప్టెంబర్ నెల 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.aries.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.