ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. బీటెక్ తో ఉద్యోగ ఖాళీలు..?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురును అందించింది. nvh india కంపెనీలో 50 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌ (మెకానికల్‌/ఈఈఈ) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2018 – 2021 […]

Written By: Navya, Updated On : June 20, 2021 9:32 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురును అందించింది. nvh india కంపెనీలో 50 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌ (మెకానికల్‌/ఈఈఈ) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

2018 – 2021 మధ్య పాసైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. 19 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి 15,592 రూపాయలు వేతనం లభిస్తుంది. ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

జూన్ నెల 20వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారో వారికి ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఎస్ఎంఎస్ ద్వారా ఇంటర్వ్యూ వేదిక, తదితర వివరాలు తెలుస్తాయి. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తైన వాళ్లకు ఉద్యోగంతో పాటు రవాణా, భోజన సదుపాయం కల్పించడం జరుగుతుంది.