https://oktelugu.com/

Job: హెచ్‌ఏఎల్ లో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండానే?

Job: హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి అప్రెంటీస్ ట్రెయినీ ఉద్యోగ ఖాళీల కొరకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 150 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటీస్ ట్రెయినీలు, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రెయినీల జాబ్స్ ను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 8, 2022 / 08:22 AM IST
    Follow us on

    Job: హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి అప్రెంటీస్ ట్రెయినీ ఉద్యోగ ఖాళీల కొరకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 150 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటీస్ ట్రెయినీలు, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రెయినీల జాబ్స్ ను భర్తీ చేయనున్నారు.

    2019 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం వరకు గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన వాళ్లు మాత్రమే గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రెయినీల ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టెక్నీషియన్ పోస్టులకు 2019 సంవత్సరం 2021 సంవత్సరం వరకు డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు అర్హులని చెప్పవచ్చు. హెచ్‌ఏఎల్ సంస్థ ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

    అయితే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు తక్కువగానే వేతనం లభించనుండటం గమనార్హం. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీ జాబ్స్ కు ఎంపికైన వాళ్లు 9,000 రూపాయల వేతనం పొందే ఛాన్స్ ఉండగా టెక్నీషియన్‌ జాబ్స్ కు ఎంపికైన వాళ్లకు నెలకు కేవలం 8,000 రూపాయల వేతనం మాత్రమే లభించనుంది. రిజర్వేషన్ తో పాటు మెరిట్ మార్కులను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారు.

    ఈ నెల 7వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2022 సంవత్సరం జనవరి 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://hal-india.co.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.